అనంతపురం జిల్లా బెలుగుప్ప మండంలోని నరసాపురం గ్రామ సమీపంలో మారెమ్మ దేవత దేవాలయం వద్ద జూదం ఆడుతున్న ఆరుగురిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7, 200 నగదును, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివ తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.