ప్రకాశం జిల్లాలో నమోదైన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని వైసిపి రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతి కుమార్ తెలిపారు. స్టేట్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ బుధవారం ఒంగోలు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలసి వినతి పత్రం అందజేశారు. జిల్లాల్లో కొన్ని వేల అక్రమ ఓట్లు ఉన్నాయని తెలిపారు. అక్రమ ఓట్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.