పర్యాటక కేంద్రమైన అరకులోయను చలి వణికిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్థానిక ప్రజలు, అరకులోయ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
గత వారం రోజులుగా అరకులోయ, మన్యంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తోంది. పగటిపూట సైతం చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.