ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగర్తలాలోని ఐసీఏ కార్యాలయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆఫీస్‌లోని ఫర్నీచర్, దస్తావేజులు కాలి బూడిదయ్యాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాలని అధికారులు తెలిపారు.