దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి వివరణ కోరినందున ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు.
కానీ, లోక్సభలో స్మోక్ ఘటన దుండగులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసింది. వివాదాస్పద పదజాలాన్ని వాడిన బీజేపీ ఎంపీ రమేష్ బిధురిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.