పెళ్లై ఐదు రోజులైనా కాలేదు. నవ వధూవరులు గోదావరిలోకి దూకారు. వధువు మృతి చెందగా వరుడిని మత్స్యకారులు కాపాడారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది.
ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణి¨(19)కి ఈ నెల 15న వివాహమైంది. మంగళవారం రాత్రి సినిమాకి వెళ్లి వస్తుండగా గొడవ జరిగింది. క్షణికావేశంలో గోదారిలో దూకారు .శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.