మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యం బాటిళ్లను గురువారం స్వాధీనం చేసుకున్నారు. దానా బందర్ ప్రాంతంలోని షోలాపూర్ స్ట్రీలో ఉన్న గోదాంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.
అక్కడ 590 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర మార్కెట్లో రూ.80 లక్షలు ఉంటుంది. అలాగే మద్యంతో వెళ్తున్న ట్రక్కును కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.