సంక్షేమ పథకాల సారధిగా, అభివృద్ధి ప్రదాతగా సీఎం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న దుర్గా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ ఆధ్వర్యంలో కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షతన వారాహిదేవి, హోమం, పూర్ణాహుతితో ప్రత్యేక పూజలు గురువారం ఘనంగా నిర్వహించారు.