ఐదు రాష్ట్రాల్లో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నట్లు ఎస్పీ అన్భురాజన్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరీపురానికి చెందిన లికన్ అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ మానే రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్చడేవాడు.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 80కి పైగా దొంగతనాలు చేశాడు. ఆయన నుంచి 23 తులాల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.