13 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెపై పది రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. మైనర్ బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లయిన మరుక్షణం బాలికను ఓ గదిలో బంధించాడు. పది రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి అరాచకాన్ని తట్టుకోలేక బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.