2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టిడిపి, జనసేన పొత్తులపై మంత్రి బొత్స సత్యనాాయణ సెటైర్లు వేశారు.
విశాఖలో గురువారం ఆయన మాట్లాడారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు?, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? రాజరికం అనుకుంటున్నారా? అని బొత్స ప్రశ్నించారు. పిల్లాడు లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు.