ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని గురువారం మృతి చెందిన ఘటన అనంతపురంలోని తపోవనంలో చోటు చేసుకుంది. తపోవనానికి చెందిన బాలరాజు, అతని స్నేహితులు ఫ్లెక్సీ ఫ్రేమ్
తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా ఫ్రేమ్‌కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంటు తీగలను తాకడంతో బాలరాజు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు.