జన్మనిచ్చిన తల్లి ఆచూకీ కోసం ఆమె కూతురు పదేళ్లుగా అన్వేషిస్తోంది. విద్య అనే అమ్మాయిని చిన్న వయసులో ఆమె తల్లి మిషనరీస్ ఆఫ్ చారిటీలో వదిలివెళ్ళింది. ఆ తర్వాత ఆమెను స్విట్జర్లాండ్ జంట 1997లో దత్తత తీసుకుంది.
దీంతో విద్య ఫిలిప్పోన్ (26) తన తల్లిని కలుసుకోవాలని గత పదేళ్లుగా ఆమె భర్తతో ముంబైలో ఉంటూ వెతుకుతోంది. ఈ విషయంలో అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్, న్యాయవాది అంజలీ పవార్ కూడా ఆమెకు సహాయపడుతున్నారు.