తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రఘురాజు, |
తెలంగాణ రాష్ట్రం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ఉన్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.