శీతాకాలంలో భాగంగా భారత్ నేడు(శుక్రవారం) సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూటని గమనించనుంది. సీజన్ మార్పులో భాగంగా ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబరు 22న ఈ కాల పరివర్తన జరుగుతుంది.
ఈ దృగ్విషయాన్నే ‘శీతాకాలపు అయనాంతం’ అని పిలుస్తారు. ఈ మార్పు కారణంగానే డిసెంబర్ 22న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.57గంటలకు శీతాకాలపు అయనాంతం సంభవించింది. దాదాపు 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు ఉంటుంది.