ఎపిలో 3 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కోవిడ్ కట్టడికి సిఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో శుక్రవారం 11 గంటలకు తన కార్యాయలంలో సమీక్షించనున్నారు.
ఇప్పటికే కాకినాడ, కర్నూలు సహా పలు జిల్లాల్లోని జిల్లా కేంద్ర ఆస్ప్రతుల్లో కరోనా కట్టడికి 50 పడకలు సిద్ధం చేశారు. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తదితరాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.