చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మేస్దితిలో ప్రజలు లేరని,గతంలో ఆయన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంతో విశ్వసనీయత కోల్పోయారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వారు ప్రస్తావించిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శ్రీ వైయస్ జగన్ విశ్వసనీయత కలిగి ఉన్నారని గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీంటిని నెరవేర్చడంతోపాటు పేదరికం స్దాయిని రాష్ర్టంలో తగ్గించగలిగారని తెలియచేశారు.రాష్ర్ట ప్రజలు శ్రీ వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా మరింతకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు.కాని చంద్రబాబుకు త్వరగా అధికారం కావాలి కాబట్టి జగన్ ను మార్చాలంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.జగన్ గారికి పేదలంటే ప్రేమ,వారి కష్టాల పట్ల సానుభూతితో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.చేసే ప్రతి చర్య లో జగన్ గారి వ్యక్తిత్వం కనిపించింది.దానికి వాళ్లు అహంకారం అని పేరు పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు.