తాటాకు చప్పుళ్లకి భయపడే వారు లేరిక్కడ అని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. వీళ్ల ప్రభుత్వం వస్తుందట..ఏదో చేస్తారట..నిద్రలో కలలు కనండి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.... వాళ్లేం మాట్లాడారో, సభ ఎందుకు పెట్టారో వారికే తెలియదు. భారీ అంటే అర్ధం ఏంటి..? భారీ బహిరంగ సభ జరిగిందా? లక్షలాది మంది వచ్చారా? దాన్ని మేం ఎందుకు అడ్డుకుంటాం. మేం ఇంకా మా పోలీసులను పెట్టి ఏమీ ఇబ్బంది లేకుండా చేశాం. ఏయూ గ్రౌండ్ అడిగితే ఇవ్వలేదా? అది నా దృష్టికి రాలేదు. నేనే సంబంధిత మంత్రిని. గతంలో ప్రధాని నరేంద్రమోడీ గారి మీటింగుకు కూడా ఇచ్చాం. వాళ్లేం మాట్లాడారో, సభ ఎందుకు పెట్టారో, దాని ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ తెలియదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం చేశారో తెలియదు. ఆయన తనయుడు ఏదేదో చెప్తూ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు రెడ్ బుక్ అంటున్నాడో ప్రజలకే అర్ధం కావడం లేదు. రాజకీయాల్లో రెడ్ బుక్ కాదు..బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ చట్టప్రకారం, నిబంధనల మేరకు నడవాలి. హోప్‌లెస్ మాటలు ఎవరూ మాట్లాడరు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? రాచరికమా? మేం చట్టప్రకారం ఏం చేయలేదో వారు చెప్పాలి. ఆయన పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నామో చెప్పండి. వాళ్లకి వారు ఊహించుకుని..బుడ్డొడ్డు..పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? జగన్ గారు పాదయాత్ర చేశారు. నేను కూడా వెళ్లి పోలీసుల వద్దకు వెళ్లి రిక్వెస్ట్ ఇచ్చాం. వారు కొన్ని నిబంధనలు ఇచ్చారు. వాటిని మేం ఎక్కడ డీవియేట్ కాలేదు. అందుకే సాఫీగా సాగింది. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చేస్తే ఎక్కడా సమస్య రాదు.. పుంగనూరులో చంద్రబాబు గొడవ ఎందుకు జరిగింది.? ఇచ్చిన రూట్ వేరు..వెళ్లిన రూట్ వేరు. అక్కడున్న స్థానికులను నిందించడం వల్లే కదా గొడవ జరిగింది. రాజకీయంగా రాజకీయ ఉపన్యాసం ఇచ్చుకోవాలి కానీ నీ ఇంటి వద్దకు వచ్చి నిన్ను తిడతాను అంటే ఊరుకుంటారా? దానికి మళ్లీ ప్రభుత్వాన్ని, పోలీసులను నిందిస్తాం..రెడ్ బుక్ అంటే ఎలా..? అని ప్రశ్నించారు.