ముక్కోటి రోజున ఉదయం 4.30 గంటల నుంచి ప్రొటోకాల్, సర్వదర్శనం, రూ.100, 200, 500 టికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ద్వారకా తిరుమల ఈవో వి.త్రినాథరావు తెలిపారు. రూ.500లకు స్లాట్స్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. గోవింద స్వాములకు, స్థానికులకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్, అధిక సంఖ్యలో భక్తులకు రానుండడంతో ఉదయం 9.30 గంటల నుంచి అన్నప్రసాదానికి అనుమతి ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే స్థానికులు తమ గుర్తింపు కోసం ఆధార్ లేదా ఏదో ఒక ఐడీ తెచ్చుకోవాలని ఈవో కోరారు.