మూడు నేర, న్యాయ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసేవపై కేంద్రీకృతమైన చట్టాలతో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోడీ అన్నారు.
భారతీయ న్యాయ సంహిత-2023, భారత నాగరిక్ సురక్ష-2023, భారతీయ సాక్ష్యా అధినియమ్-2023 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత.. బ్రిటీష్ వారి దేశద్రోహంపై కాలం చెల్లిన సెక్షన్లకు వీడ్కోలు తెలిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో చెప్పారు.