కెనడాలోని ఆంటేరియో ప్రావిన్సు కిచ్‌నా నగరంలో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు పీల్చి భారతీయ విద్యార్థి (25) మృతి చెందాడు. ఇంట్లోని గ్యారేజీలో కారును రాత్రంతా ఆన్‌లోనే వదిలేయడంతో ఈ వాయువు వ్యాపించిది.
ఉదయాన్నే నిద్ర లేచిన ఆ విద్యార్థి గ్యారేజీ తలుపు తీశాడు. దీంతో విష వాయువు వ్యాపించగా దానిని పీల్చి అతను కుప్పకూలిపోయాడు. ఈ సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని మరో 7 మందిని ఆసుపత్రికి తరలించారు.