ట్రాక్టర్ ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.