ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 అంత ప్రమాదకరమేమీ కాదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
మరో వారం, పది రోజుల్లో జేఎన్–1 వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి.. వైరస్ తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందన్నారు.