ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎర్నాకుళం-హతియా మధ్య జన్సాధారణ్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శనివారం తెలిపారు.
ఈ నెల 22, 29, జనవరి 5 తేదీల్లో ఎర్నాకుళం-హతియా(06131) ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మూడో రోజు తెల్లవారుజామున 12.12 గంటలకు దువ్వాడ చేరుకుంటుందన్నారు. ఈ రైలు 21 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు, రెండు సీటింగ్ కమ్ లగేజీ బోగీలతో నడుస్తుందని పేర్కొన్నారు.