మాడుగులలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వివిధ వైష్ణవాలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉత్తరద్వార దర్శనాలు జరిగాయి. మాడుగులల్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి, పార్థసారథి స్వామి, సీతారామస్వామి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి, కన్యకాపరమేశ్వరి, రామాలయాల్లో ఉత్తర ద్వారల ద్వారా భక్తులు ఆ దేవదేవుని దర్శించుకున్నారు.