చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు, ఎన్నో అమానుషాలు జరిగాయని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితులపై పెత్తందారులు పెట్టించిన కేసులను సీఎం జగన్ ఎత్తివేయిస్తే వాటిని కూడా రాజకీయమంటున్న చంద్రబాబుకు సిగ్గుందా అని దుయ్యబట్టారు. కొంత మంది దళితులను తన దగ్గర పెట్టుకొని చంద్రబాబు వారితో నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ తీవ్రంగా ఆరోపించారు. దళితులకు మేలు జరిగే కార్యక్రమాలను కోర్టుకు వెళ్లి అడ్డుకున్న చరిత్ర కూడా చంద్రబాబుదేనని మంత్రి నిప్పులు చెరిగారు.