తింటున్నప్పుడు భుజం తగులుతుందని 17 ఏళ్ల బాలుడ్ని మరో మైనర్ చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ద్వారకాలోని రోహ్తాష్ నగర్లో ఓ బాలుడు సమీపంలో ఉన్న హోటల్‌కు వెళ్లాడు.
అక్కడ మోమోలు తింటున్న మరో బాలుడికి బాధితుడి భుజం తగిలింది. దాంతో వారిద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో పక్కనే ఉన్న కత్తి తీసుకుని బాలుడ్ని దారుణంగా పొడిచి పారిపోయాడు. గాయపడిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.