ఎన్నికలు వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓ గజదొంగ. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు మాత్రం వారిపై కేసులు ఎత్తివేశారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా? అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అయన మాట్లాడుతూ..... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల ప్రజలకు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని మేలు చేస్తున్న ఈ ప్రభుత్వంపైనా, జగన్ మోహన్ రెడ్డిగారిపైనా, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. చంద్రబాబుకు మతిస్థిమితంలేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. రామోజీ ఎల్లో రాతలు-బాబు మాటలు అందులో భాగమేనన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా మనుగడ కోసమే చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు. నాడు-నేడు కింద స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగుచేసిన చరిత్ర వైఎస్ జగన్ గారిదే. వైఎస్సార్సీపీకి దళితుల సంపూర్ణ మద్దతు ఉంది అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.