అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్త ఎన్ఆర్ఐ యష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో యష్‌ను అరెస్ట్ చేసి... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు ఆయన మీద కేసులు పెండింగ్‌లో ఉండటంతో తీసుకువచ్చామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, న్యాయవాదులు పీబీజీ ఉమేష్ చంద్ర, గూడుపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. యష్‌కు సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ ప్రకారం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 11న విచారణకు హాజరుకావాలని నోటీసులో సీఐడీ అధికారులు కోరారు.