శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర హరే సముద్రం గ్రామ సచివాలయం పరిధిలో ఏపీకి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కవిత సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ జగనన్న ని ఆశీర్వదించాలని కోరారు.