ధర్మవరం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ లో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులు వారి ఉద్యోగాలను పెర్మనెంట్ చేయాలని కోరుతూ శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు వారు మద్దతు తెలిపారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలనీ లేని యెడల డిసెంబర్ నెల 26 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.