టీడీపీ కార్యకర్త ఎన్ఆర్ఐ యష్ అరెస్ట్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... యష్ అరెస్టు దుర్మార్గమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. యష్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి కర్నూలు పోలీసులను పంపించి గుంటూరు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి ఇక్కడకు లాక్కొచ్చారన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తీసుకురావటం అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.