ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు కేసులు, అరెస్టులతో వేధిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...2024లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఎన్నో పథకాలు చేపట్టానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలని పారిశ్రామికవేత్తలుగా చూడాలని తపించారన్నారు. ఇసుక డిస్ట్రిబ్యూషన్ని డ్వాక్రా మహిళలకి అప్పగించి ప్రోత్సహించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ వల్ల చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించారని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించారని నారాయణ పేర్కొన్నారు.