అంగన్వాడీలను అణిచివేయడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మెలో ఉన్న... ప్రభుత్వం పట్టించుకోకపోవడం అహంకార దోరణికి నిదర్శనమన్నారు. నాడు అంగన్వాడీల కష్టాన్ని, సేవను టీడీపీ ప్రభుత్వం గుర్తించిందన్నారు. టీడీపీ హయాంలో అంగన్వాడీల వేతనాలు రూ.10,500 చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అర్థంలేని ఆంక్షలు పెట్టి పథకాలకు కోతలు పెట్టారని విమర్శించారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అంగన్వాడీల జీతాలు పెంచలేదన్నారు.