వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు. పిటీషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణను వాయిదా వేసింది. వ్యూహ్యం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన రిట్ పిటీషన్‌పై ఈ నెల 26వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. సినిమాకు సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని లోకేష్ పిటీషనలో పేర్కొన్నారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.