ఎన్‌ఆర్‌ఐ యష్ అరెస్ట్‌ను టీడీపీ యువనేత లోకేష్ ఖండించారు. యష్ అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యష్‌ను అరెస్టు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. యష్‌ను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా... అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ యష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో యష్‌ను అరెస్ట్ చేసి... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన మీద కేసులు పెండింగ్‌లో ఉండటంతో తీసుకువచ్చామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, న్యాయవాదులు పీబీజీ ఉమేష్ చంద్ర, గూడుపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.