టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు సమర్పించారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని వెల్లడించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa