అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన కెల్సే హేచర్ (32) రెండు గర్భాశయాలు కలిగి, రెండు గర్భాలు దాల్చింది. ఇలాంటి ఘటన వైద్య చరిత్రలోనే అరుదైనదని వైద్యులు పేర్కొన్నారు.
కాగా ఆ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. డిసెంబర్ 19న ఉదయం ఒకరికి, డిసెంబర్ 20న ఉదయం మరొకరికి జన్మనిచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ ఆడశిశువులే కావటం విశేషం.