ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పికె) టిడిపితో కలసి పనిచేయబోతున్నారు. ఆయన శనివారం చంద్రబాబుతో సమావేశమై 3గంటల పాటు చర్చించారు. నారా లోకేశ్, రాబిన్‌శర్మ పాల్గొన్నారు.
రాబిన్‌శర్మ ఒకప్పుడు ఐప్యాక్ సంస్థలో పీకే సహచరుడు. పికె బృందం మూడు నెలల క్రితం నుంచే టిడిపి కోసం పనిచేయడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు రాబిన్‌శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో పనిచేయనున్నట్లు సమాచారం.