కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క రోజులోనే 752 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగినట్లు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు WHO పేర్కొంది.