రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 24నుంచి 28 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 29నుంచి 30డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23డిగ్రీల సెల్సియ్స్గా నమోదవుతుందని పేర్కొంది.