అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు.ప్లాంట్ నిర్మాణానికి 2019, 2023లో రెండుసార్లు భూమిపూజ చేశారని, ప్లాంట్ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు.