కొమరాడ మండలం అర్తం రైల్వే గేట్ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత కొద్దీ రోజులుగా పాత దుగ్గి గ్రామంలో సంచరించిన ఏనుగులు ఆదివారం అర్తం సమీపంలో రైల్వే పట్టాలపై దర్శనమిచ్చాయి. ఏనుగులతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులు చూసుకొని వెళ్లాలని, ఏనుగుల వద్దకి వెళ్లి ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులు కోరారు.