కమలాపురం మండల పరిధిలోని గంగవరం గ్రామంలో శనివారం బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూత్తా నరసింహారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు పట్టడంలేదన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా కమీషన్ల కోసం పనిచేస్తున్నారని నరసింహారెడ్డి అన్నారు.