ప్రోద్దుటూరులో జనవరి 7, 8 తేదిల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని వేంపల్లె భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు బి. రామంజనేయులు, ప్రధాన కార్యదర్శి చల్లా బాలాజీ పిలుపునిచ్చారు. ఆదివారం వేంపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. కార్మికుల ఐక్యత, సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై మహాసభలు జరగనున్నట్లు వారు వివరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.