ఇచ్చాపురం నియోజకవర్గంలోని బెంతు ఒరియా కులస్తులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాల సమస్యను సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు జెసి ఎం నవీన్ అన్నారు. ఇచ్చాపురం తాసిల్దార్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి చెందిన బెంతు ఒరియా కుల పెద్దలతో మాట్లాడారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు దక్కడం లేదని ఆ సంఘ నాయకులు జెసి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.