తమిళనాడులో ఓ మచ్చల జింకను ఏడుగురు వ్యక్తులు వేటాడారు. అనంతరం దాని మాంసాన్ని విక్రయించారు. అటవీశాఖ సిబ్బంది వారిని పట్టుకుని ఒక్కొక్కరికి రూ.50వేలు జరిమానా విధించింది. మరోసారి వన్య జంతువులను వేటాడినా, వాటికి సంబంధించిన వస్తువులను కలిగి ఉన్నా వన్యప్రాణుల చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అయితే నిందితుల్లో 18 ఏళ్ల యువకుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.