హౌతీ ఉగ్రవాదులు తాజాగా మరో హెచ్చరిక జారీచేశారు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు జరుగుతుండడంతో.. ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం బాబ్ అల్-మందబ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రకటనను విడుదల చేశారు.