అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది. ఈనేపథ్యంలో సముద్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రారంభించింది. పశ్చిమ తీరంలో గస్తీ కోసం మూడు ఐఎన్ఎస్ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటికి మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. అలాగే, పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది.