శాంతిపురం మండలం సోలిసెట్టిపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా గ్రానైట్ తరలింపుపై గ్రామస్తులు టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముందుగా గ్రానైట్ దిమ్మెలను తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రానైట్ తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంభందిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు విశ్వనాధ్ డిమాండ్ చేశారు.